Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండటంతో ఆ రాష్ట్రంలో ఆప్‌తో పొత్తుకు కసరత్తు సాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ భేటీలో రాహుల్ గాంధీ ఆప్‌తో పొత్తు ప్రతిపాదనను పరిశీలించాలని పార్టీ ముందుంచినట్టు సమాచారం. పంజాబ్‌లో 90 అసెంబ్లీ స్ధానాలకు గాను ఆప్ అభ్యర్ధులకు 3, 4 స్ధానాలు కేటాయించాలని కోరినట్టు పంజాబ్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా చెప్పారు.
ఇక 30 స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ త్వరలో జాబితాను విడుదల చేయనుంది. ఆప్‌తో ఎన్నికల పొత్తుకు సంబంధించి చర్చలపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇవ్వడం ద్వారా విపక్ష ఇండియా కూటమి పటిష్టంగా ఉందనే సంకేతాలు పంపేందుకు రాహుల్ గాంధీ ఆప్‌తో పొత్తుకు ఆసక్తి కనబరుస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో పది స్ధానాలకు గాను విపక్ష కూటమి 5 స్ధానాల్లో విజయం సాధించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పది స్ధానాలనూ బీజేపీ గెలుచుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్ధితి మెరుగవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది సత్తా చాటాలని కాషాయ పార్టీని మట్టికరిపించాలని రాహుల్ గాంధీ కసరత్తు సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ఆప్ ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సంప్రదించిన మీదట ఈ దిశగా తుది నిర్ణయం తీసుకుంటామని ఆప్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.
Read More :