Paralympics 2024 : పారిలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన షూటర్ అవని లేఖరా(Aanvi Lekhari) మళ్లీ అదరగొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి కొల్లగొట్టిన ఆమె మరో పతకానికి చేరువైంది. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో అవని చెక్కు చెదరని గురితో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదే పోటీల్లో మరో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ నిరాశపరిచింది.
పారిస్‌లో స్వర్ణంతో దేశానికి తొలి పతకం అందించిన అవని మరో పతకంపై గురి పెట్టింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో ఆమె 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయింది. దాంతో, పారిస్‌లో రెండో పతకం గెలిచే అవకాశం ఆమెకు వచ్చింది. ఫైనల్లో అవని ఉత్తమ ప్రతిభ కనబరిస్తే దేశం ఖాతాలో మరో పసిడి చేరడం ఖాయం. ఇప్పటికే అథ్లెట్ ప్రీతి పాల్ 100 మీటర్ల, 200 మీటర్ల పరుగులో కాంస్యంతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
AVANI LEKHARA DOES IT AGAIN! 🎯🔥
Qualifying at 7th spot, Avani Lekhara advances to the FINAL of Women’s 50m Rifle 3P SH1 #ParaShooting 🎉#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 @mansukhmandviya @IndiaSports @MIB_India @PIB_India @DDNewslive @ParalympicIndia… pic.twitter.com/PiSU3SWR6o— Doordarshan Sports (@ddsportschannel) September 3, 2024
పారిలింపిక్స్ రెండో రోజే అవని పతక గర్జన చేసింది. రికార్డు స్కోర్‌తో ఆమె పసిడి వెలుగులు విరజిమ్మగా.. మోనా అగర్వాల్ (Mona Agarwal) మూడో స్థానంలో నిలిచి కంచు మోత మోగించింది. ఈ ఇద్దరి స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్ (Preethi Pal) సైతం కాంస్యంతో సంచలనం సృష్టించింది.
అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. యువ పారా షూటర్ మనీశ్ నర్వాల్ (Manish Narwal) సైతం రజతంతో మెరిశాడు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మనీశ్ సూపర్ గురితో వెండి వెలుగులు విరజిమ్మాడు. పారా షట్లర్లు నితీశ్, తులసీమతి, మనీషాలు.. డిస్కస్ త్రోయర్ యోగేశ్‌లు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.