TG Rains | రాష్ట్రంలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, ఉదయ్‌పూర్ అల్పపీడనం కేంద్రంగా.. పశ్చిమ విదర్భ, రామగుండం, కళింగపట్నం, ఆగ్నేయ దిశగా తూర్పు బంగాళాఖాతం మీదుగా వెళ్తుందని, సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. కోస్తాంధ్ర, యానాం వరకు విస్తరించి ఉందని తెలిపింది. గురువారం వరకు పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మంగళవారం తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే ఛాన్స్ ఉందని చెప్పింది. బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలుపడే సూచనలున్నాయని పేర్కొంది.
Harish Rao | వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ : హరీశ్‌రావు
Khammam Floods | ఖమ్మంలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల దాడులు