Prison | డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of Congo)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి అతిపెద్ద జైల్లో (Prison) తొక్కిసలాట చోటు చేసుకుని వంద మందికి పైగా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
రాజధాని కిన్షాసా (Kinshasa)లోని మకాలా సెంట్రల్ జైల్లోని ఖైదీలు మూకుమ్మడిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జైలును బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు (Attempted Prison Break). అప్రమత్తమైన గార్డులు రంగంలోకి దిగి ఖైదీలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి తోడు జైలు కిచెన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 129 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 24 మంది మంటల్లో సజీవ దహనం అయినట్లు ఇంటీరియర్ మంత్రి షబాని లుకో వెల్లడించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన కాంగో వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read..
Harish Rao | ఖమ్మం వరద బాధితుల బాధలు విని.. తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీశ్‌రావు
AP News | ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా.. వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్
Priya Banerjee | తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ప్రియా బెనర్జీ