రాహుల్ మళ్లీ ఫెయిల్!.. 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటీ గెలవలేదు!
బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశను మిగల్చడమే కాదు .. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో సుదీర్ఘ యాత్రను నిర్వహించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి.
- తిరస్కరించిన బీహార్..
న్యూఢిల్లీ, నవంబర్ 14: బీహార్ ఎన్నికల (Bihar Elections) ఫలితాలు కాంగ్రెస్ (Congress) పార్టీకి తీవ్ర నిరాశను మిగల్చడమే కాదు .. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో సుదీర్ఘ యాత్రను నిర్వహించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. గతంలో చేసిన రెండు యాత్రల వల్ల ఇదివరకు జరిగిన కొన్ని ఎన్నికలలో తమ పార్టీ బలోపేతం అయిందని సంతోషించిన కాంగ్రెస్‌కు బీహార్ ఫలితాలు ఆశాభంగం కలిగించాయి.
ససారాంలో ప్రారంభమై పాట్నాలో ముగిసిన రాహుల్ యాత్ర 25 జిల్లాలను దాటుకుంటూ మొత్తం 110 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టింది. దాదాపు 1,300 కిలోమీటర్లు సాగింది. అయితే రాహుల్ యాత్ర సాగిన మార్గంలో ఉన్న ఏ ఒక్క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చకపోవడం గమనార్హం.
రాహుల్ గతంలో చేసిన యాత్రల వల్ల 2024 లోక్‌సభ ఎన్నికలలో మెరుగైన ఫలితం, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. బీజేపీ, ఎన్నికల కమిషన్‌పైన రాహుల్ చేసిన ఓటు చోరీ ప్రచారం బీహార్ ఓటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.
బీహార్ ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్‌లో ఆత్మపరిశీలన ఇంకా మొదలు కానప్పటికీ మహాఘట్బంధన్లో ఏర్పడిన అనైక్యతే ఆ కూటమికి ప్రతికూలంగా మారినట్లు కనపడుతోంది. అనేక నియోజకవర్గాలలో జరిగిన స్నేహపూర్వక పోటీలు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీని కూడా దెబ్బతీసినట్లు కనపడుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

