LPG Price Hike : కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.990 ధర పెంచింది. అయితే, ఎన్నికలు ముగిసిన రెండు రోజుల్లోనేన ఇలా గ్యాస్ ధరలు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో కేంద్రంపై ఫైర్ అయ్యారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుందని నేను ఎప్పుడో చెప్పాను. ఈ రోజు కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంచారు. ఒక్క రోజులోనే ఇంత ధర పెంచడం ఇదే మొదటిసారి. ఇది ఎన్నికల బిల్లు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.1380 పెంచారు. అంటే, మూడు నెలల్లోనే 81శాతం ధరలు పెంచారు. దీనివల్ల ప్రతి ఇంటి వంటగదిపై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా టీ స్టాల్, దాబా, హోటల్, బేకరి, స్వీట్ షాపులపై భారం పడుతుంది. దీంతో ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఎల్పీజీ ధరలు పెంచారు. తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచతారు” అంటూ రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కేంద్రం నిర్ణయం వల్ల చిన్న వ్యాపార సంస్తలపై భారం పడి, ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని రాహుల్ అన్నారు. మరోవైపు ఎల్పీజీ ధరల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడింది. ఎన్నికల తర్వాత ఒకేసారి ఎల్పీజీ ధరలు రూ.990 పెంచడం ద్వారా టీ షాపులు, రెస్టారెంట్ల, వ్యాపారులు ధరలు పెంచుతారు. కానీ, అదానీ సామ్రాజ్యం మాత్రం పెరుగుతూనే ఉంటుంది అంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. ఏప్రిల్ 29న ఎన్నికలు ముగియగానే, మే 1న.. అంటే మూడు రోజుల్లోనే ధరలు పెంచేసింది కేంద్రం అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.