Rahul Gandhi : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం మోదీ కార్యక్రమమని ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ మంగళవారం నాగాలాండ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవ వేడుకను ఆరెస్సెస్, బీజేపీ పూర్తిగా మోదీ కార్యక్రమంగా మార్చాయని రాహుల్ ఎద్దేవా చేశారు.
అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని కాంగ్రెస్ చీఫ్ వెల్లడించారని అన్నారు. తాము అన్ని మతాలకు, అన్ని ఆచారాలకు అనుకూలమని, అయితే హిందూ మత పెద్దల్లో పలువురు ఈనెల 22న జరిగే కార్యక్రమంపై అభిప్రాయాలను స్పష్టం చేశారని, ఇది రాజకీయ కార్యక్రమమని వారు స్పష్టం చేశారని గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ డిజైన్ చేసిన ఈ రాజకీయ కార్యక్రమానికి హాజరవడం తమకు కష్టమని అన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసం రామాయల ప్రారంభ వేడుకను పొలిటికల్ ప్రాజెక్ట్‌గా కాషాయ పార్టీ మార్చిందని ఆరోపిస్తూ ఈ వేడుకకు తాము దూరంగా ఉంటామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి తేల్చిచెప్పారు.
Read More :
Delhi | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం