బెంగళూర్ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పేదలు, బలహీనవర్గాలను ఆదుకునేలా పనిచేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేస్తోంది. బిలియనీర్లకు ఊడిగం చేయడం కాషాయ సర్కార్‌కు ఫ్యాషన్‌గా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం అనేది పేదలు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలన్నది తమ అభిమతమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో వేలాది మంది మహిళలను తాను కలిశానని, ధరల పెరుగుదలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా మహిళలు తనతో తమ గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు.
ధరల మంటను తాము భరించే స్ధితిలో లేమని గృహిణులు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కర్నాటకలో సిద్ధరామయ్య సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పధకం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
Read More :
Rahul Gandhi: చైనా మ్యాప్‌లో అరుణాచల్, లడాఖ్.. ప్రధాని మౌనం వీడాలన్న రాహుల్ గాంధీ