Rahul Gandhi | కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడ ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారత్లో బీజేపీ, ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే (fear of BJP vanished) విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు.
‘మన సంప్రదాయాలు, భాషపై బీజేపీ దాడి చేస్తోందని ప్రజలు అంటున్నారు. ఆ పార్టీ ఎలాంటిదో వారు గ్రహించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ( Lok Sabha polls) వెలువడిన వెంటనే భారత్లో బీజేపీ, భారత ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయం అర్థమైంది. ప్రజాస్వామ్యంపై దాడిని తాము ఎన్నటికీ అంగీకరించబోమని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా చెప్పారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారతదేశాన్ని అవమానించే అలవాటు గాంధీకి ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Also Read..
Bajrang Punia | కాంగ్రెస్లో చేరిన రోజుల వ్యవధిలోనే.. బజరంగ్ పునియాకు బెదిరింపులు
Rahul Gandhi | భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం వంటివి లేవు : రాహుల్ గాంధీ
Sam Pitroda | రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు.. : శామ్ పిట్రోడా