Rahul Gandhi | భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం వంటివి లేవు : రాహుల్ గాంధీ
Rahul Gandhi | భారత రాజకీయాల్లో (Indian Politics) ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Rahul Gandhi | భారత రాజకీయాల్లో (Indian Politics) ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం రాహుల్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెక్సాస్ (Texas)లోని ఇండియన్ అమెరికన్ కమ్మూనిటీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భారత్ అంటే ఒకే ఆలోచన అని ఆర్ఎస్ఎస్ (RSS) నమ్ముతోందని వ్యాఖ్యానించారు. కానీ, భారత్ అంటే బహుళ ఆలోచనలు అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అగ్రరాజ్యం అమెరికాలో లానే అందరికీ ప్రాతినిథ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. కులం, మతం, భాష, సంప్రదాయం, చరిత్రతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలు కనేందుకు అర్హులే అని అన్నారు. కానీ, భారత్‌లో ఇప్పుడు ఆ పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తోందని తెలిపారు. భారత ప్రధాన మంత్రి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైందని వ్యాఖ్యానించారు.
రాజకీయ నాయకులు కుల మతాలకు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. కానీ భారత రాజకీయ వ్యవస్థలో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవన్నారు. ‘భారత రాజకీయ వ్యవస్థల్లో, పార్టీల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని నేను భావిస్తున్నాను. కులమతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి. అత్యంత శక్తివంతమైన వ్యక్తులను మాత్రమేకాదు, భారతదేశాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.
Also Read..
AP News | ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. అల్లూరి జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
FD | డిపాజిట్లకు వేళాయెరా.. స్పెషల్ ఎఫ్డీలకు సమీస్తున్న గడువు
KCR | బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

