Rahul Gandhi | మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలతోపాటు పలు పార్టీల నాయకులు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్‌కు అంజలి ఘటించారు. ఇక రాజీవ్ కుమారుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా తన తండ్రికి నివాళులర్పించారు.
पूर्व प्रधानमंत्री श्री राजीव गांधी जी की जयंती पर श्री @RahulGandhi ने वीर भूमि जाकर श्रद्धासुमन अर्पित किए। pic.twitter.com/CVM3nr8kMe
— Congress (@INCIndia) August 20, 2024
మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్ భూమి (Veer Bhumi)ని సందర్శించి రాజీవ్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా తండ్రి జయంతి సందర్భంగా రాహుల్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘దయగల వ్యక్తిత్వం, సహృదయత, సద్భావనకు ప్రతిరూపం.. పాపా, మీరు చెప్పిన పాఠాలే నాకు స్ఫూర్తి. భారతదేశం కోసం మీరు కన్న కలలు నా సొంతం. నేను వాటిని నెరవేరుస్తాను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
एक करुणामय व्यक्तित्व, सौहार्द और सद्भावना के प्रतीक…
पापा, आपकी सीख मेरी प्रेरणा है, और भारत के लिए आपके सपने मेरे अपने – आपकी यादें साथ ले कर इन्हें पूरा करूंगा। pic.twitter.com/LFg6N43eZW
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2024
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, జైరాం రమేశ్ సహా పలువురు నాయకులు రాజీవ్ గాంధీకి సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.
Also Read..
Corruption case | ఆర్జీ కార్ మాజీ చీఫ్‌పై అవినీతి ఆరోపణలు.. కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు
Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
CM Revanth Reddy | రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి