Corruption case | కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో వైద్య కళాశాల మాజీ చీఫ్ (colleges ex head) సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హత్యాచార ఘటన నేపథ్యంలో ఆయన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైద్యురాలి ఘటనలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఆయనపై అవినీతి ఆరోపణలు (Corruption case) వెల్లువెత్తాయి. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే స్పందించి.. కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
ఈ సిట్‌కు అధిపతిగా ఐజీ ప్రణవ్ కుమార్‌ను నియమించింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణకు అవసరమైన డాక్యుమెంట్లను సిట్ బృందానికి సమర్పించి, విచారణకు సహకరించాలంటూ ప్రభుత్వం వివిధ విభాగాలకు నోట్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, వైద్యురాలి హత్యాచారం కేసులో సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
Donald Trump | ఎలాన్ మస్క్‌కు నా కేబినెట్లో చోటు కల్పిస్తా : డొనాల్డ్ ట్రంప్
P Susheela | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రముఖ గాయని సుశీల