Donald Trump | అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ యూఎస్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) మొదటి నుంచి తన పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఇటీవలే ట్రంప్‌ను మస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు.
ఈ క్రమంలోనే వీరి మధ్య బంధం రోజురోజుకూ మరింత బలపడుతోంది. మరోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ తాజాగా వెల్లడించారు. తన కేబినెట్లో చోటు కల్పిస్తానని (Cabinet position) చెప్పారు. అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా (advisory role) నియమించుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ ఆఫర్‌పై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Also Read..
P Susheela | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రముఖ గాయని సుశీల
Earthquake | కశ్మీర్ లోయను వణికించిన భూకంపం.. నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి
Rain Alert | హైదరాబాద్‌లో మరో 2 గంటలు భారీ వర్షం.. ప్రజలు బయటకు రావొద్దన్న జీహెచ్ఎంసీ