Earthquake | జమ్మూకశ్మీర్లో భూకంపం (Earthquake) సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే స్వల్ప స్థాయిలో రెండు సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రెండూ బారాముల్లా (Baramulla) జిల్లాలోనే నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ముందుగా మంగళవారం ఉదయం 6:45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత 7 నిమిషాలకే అంటే 6:52 గంటల సమయంలో 4.8 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవి భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
రెండు సార్లు భూమి కంపించడంతో లోయలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రెండు ప్రకంపనలూ స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం.
Also Read..
Air Travel | విమాన ప్రయాణంతో అనారోగ్యం.. జర జాగ్రత్త!
Layoffs | తక్కువ డిమాండ్, నెమ్మదించిన విస్తరణ.. రిటైల్ కంపెనీల్లో 26 వేల ఉద్యోగుల కోత
Kolkata Doctor Case | ఆమె డైరీలో చిరిగిన పేజీ.. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కోణం