Layoffs | తక్కువ డిమాండ్, నెమ్మదించిన విస్తరణ.. రిటైల్ కంపెనీల్లో 26 వేల ఉద్యోగుల కోత
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో డజనుకు పైగా రిటైల్ కంపెనీలు 26 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. లైఫ్ ైస్టెల్, కిరాణా, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాపార డిమాండ్ తక్కువగా ఉండటం, స్టోర్ల విస్తరణ నెమ్మదిగా చేయడం వల్ల ఉద్యోగాల్లో కోతలు విధించాల్సి వచ్చిందని ఆయా కంపెనీలు తెలిపాయి.
Layoffs | న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో డజనుకు పైగా రిటైల్ కంపెనీలు 26 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. లైఫ్ ైస్టెల్, కిరాణా, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాపార డిమాండ్ తక్కువగా ఉండటం, స్టోర్ల విస్తరణ నెమ్మదిగా చేయడం వల్ల ఉద్యోగాల్లో కోతలు విధించాల్సి వచ్చిందని ఆయా కంపెనీలు తెలిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం, టైటాన్, రేమండ్, పేజ్ ఇండస్ట్రీస్, స్పెన్సర్ ఉద్యోగులను ఎక్కువగా తొలగించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం మందిని ఈ కంపెనీలు తొలగించాయి.
మరోవైపు కోతలపై రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ మాట్లాడుతూ.. ‘ప్రతిభకు కొరత ఉంది. ఈ విషయంలో మేము విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేస్తున్నాం. వ్యాపారాలను మూసేయడం వల్ల కొన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అయితే షాపర్స్ స్టాప్, ట్రెంట్ లాంటి కంపెనీలు స్టోర్ల విస్తరణ చేపడుతూ అదనపు సిబ్బందిని నియమించుకుంటున్నాయి’ అని తెలిపారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, స్టార్టప్, ఐటీ రంగాల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం వల్ల అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లు 2022 నుంచి తగ్గాయని ఓ నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

