హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాగా, మరో రెండు గంటల పాటు హైదరాబాద్‌లో భారీ వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏదైనా సమస్యకు టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667కు సంప్రదించాలని తెలిపారు.
కాగా, తెల్లవారుజాము నుంచి కుండపోతగా వాన కురుస్తున్నది. దీంతో ఉదయం 6.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో 120 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదయ్యింది. చాలా చోట్ల 80 నుంచి 120 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కొంపల్లి, మాదాపూర్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ భారీ వర్షం కురిసింది.
మలక్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, నాగారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్, ముషీరాబాద్, రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఆర్వోబీ నీట మునగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ముసారాంబాగ్, సంతోశ్‌నగర్ వరకు, కోఠీ వైపు చాదర్‌ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీవద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Today Early Morning Insane Lightning ⚡ Strikes in #Hyderabad 😳
516KA 😱😱😱 Strike near #Miyapur Metro Depot 🙏 at 5:44AM
More Details Below👇#HyderabadRains pic.twitter.com/UYOmVINO1c
— Hyderabad Rains (@Hyderabadrains) August 20, 2024
Century rainfall across many parts of Hyderabad. Few parts have got 120mm rains, many places had 80-120mm rains, my goodness what an insane storm it is. Praying for safety of low lying areas 🙏. As already said, severe downpour till 6.40AM, light rains till 8/8.30AM. STAY SAFE ⚠️
— Telangana Weatherman (@balaji25_t) August 20, 2024
Tooo much heavy rain Secunderabad to Kphb @balaji25_t pic.twitter.com/WUUmPVlNcX
— Jhon 𓃵 (@NTRPSPK4) August 20, 2024