P Susheela | ప్రముఖ సినీ నేపథ్య గాయని (Veteran singer), పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల (P Susheela) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు (discharged from hospital). ఈ విషయాన్ని సుశీలమ్మే స్వయంగా వెల్లడించారు. పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరినట్లు చెప్పారు.
రెండు రోజుల క్రితం సుశీల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కడుపులో నొప్పి రావడంతో గాయనిని కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. దీంతో వైద్యులు ఇవాళ సుశీలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని సుశీలమ్మే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు.
#PSusheela #PSuseela #பிசுசீலா pic.twitter.com/4yYFtIxZJo
— Actor Kayal Devaraj (@kayaldevaraj) August 20, 2024
Also Read..
Earthquake | కశ్మీర్ లోయను వణికించిన భూకంపం.. నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి
KTR | మేఘాపై సీఎం రేవంత్ ప్రత్యేక ఔదార్యం.. ఈ బంధం వెనక మతలబు ఏంటో?: కేటీఆర్
Rain | గద్వాల జిల్లాలో భారీ వర్షం.. అయిజ నుంచి ఏపీకి నిలిచిన రాకపోకలు