Manipur Violence : అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌లో కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. విష్ణుపూర్‌లోని మైరంగ్ పునరావస శిబిరంలో బాధితులను రాహుల్ పరామర్శించారు. శిబిరంలో తలదాచుకుంటున్న వారితో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం ఇంఫాల్‌కు చేరుకున్నారు.
ఆపై రాహుల్ జిరిబాం శరణార్ధ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులతో ముచ్చటించనున్నారు. రాహుల్ మణిపూర్ పర్యటన సందర్భంగా జిరిబాం అధికారులు బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిరిబాంను నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. మణిపూర్ సున్నితమైన అంశమని, అక్కడ శాంతి నెలకొనేలా ప్రతి ఒక్కరూ పూనుకోవాలని అన్నారు.
కానీ రాహుల్ గాంధీ సున్నితమైన మణిపూర్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మణిపూర్‌పై పార్లమెంట్లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఎలాంటి రభస సృష్టించాయో చూశామని చెప్పారు. నూతన పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ప్రధాని మాట్లాడుతుంటే ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. విపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిస్తామని, కానీ ఆయన తీరు విచారకరమని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
Read More :