న్యూఢిల్లీ : ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా ధర్నా చేస్తుంటే.. బీజేపీ ఎనిమిదేళ్ల పాలన వేడుకల్లో బిజీగా ఉందని ఆరోపించారు. మంగళవారం కుల్గామ్‌లో ఉపాధ్యాయురాలు రజనీ బాలాపై కాల్పులు జరుపడంతో ఆమె మృతి చెందింది.
ఈ క్రమంలో రాహుల్ స్పందించారు. ‘లోయలు శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు నిజం. కశ్మీర్లో గత ఐదు నెలల్లో 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 18 మంది పౌరులు మరణించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కుల్గామ్‌లో రజనీ బాలాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
పాఠశాల వద్దకు చేరుకున్న రజనీపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఆమెను స్థానికులు, పాఠశాల సిబ్బంది జిల్లా దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రజనీ భర్త రాజ్‌కుమార్ సైతం ఉపాధ్యాయుడే. ఆయన కశ్మీర్ విభాగంలో పని చేస్తున్నారు. ఈ దంపతులకు 12 కూతురు ఉండగా.. తల్లిదండ్రులతో కలిసి ఆమె లోయలో నివాసం ఉంటున్నది.
कश्मीर में पिछले 5 महीनों में 15 सुरक्षाकर्मी शहीद हुए और 18 नागरिकों की हत्या कर दी गयी। कल भी एक शिक्षिका की हत्या कर दी गयी।
18 दिनों से कश्मीरी पंडित धरने पर हैं लेकिन भाजपा 8 साल का जश्न मनाने में व्यस्त है।
प्रधानमंत्री जी, ये कोई फ़िल्म नहीं, आज कश्मीर की सच्चाई है।
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2022