లక్నో : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసు విచారణకు బుధవారం ఆయన హాజరుకావలసి ఉంది. కానీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు కోరారు. దీంతో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 14న విచారణకు తప్పనిసరిగా ఆయన హాజరుకావాలని, గైర్హాజరైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.