ఇంఫాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్‌ను మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం అక్కడకు వెళ్లారు. రాజధాని ఇంఫాల్ విమానాశ్రయంలో విమానం దిగిన రాహుల్ గాంధీ అల్లర్లతో రగిలిన చురచంద్‌పూర్‌కు కారులో బయలుదేరారు. అక్కడి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అలాగే పౌర సమాజ ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
కాగా, భద్రతాపరమైన కారణాలు, దాడులు జరుగవచ్చన్న అనుమానంతో రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను బిష్ణుపూర్ ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సందర్శించనున్న ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గత రాత్రి కూడా అల్లర్లు జరిగినట్లు బిష్ణుపూర్ ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ కాన్వాయ్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని, అందుకే ఆయన వాహన శ్రేణిని అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లో చురచంద్‌పూర్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. రాహుల్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.
మరోవైపు మణిపూర్‌లో మైతేయి వర్గానికి షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కల్పించాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి నిరసనగా మే 3న ‘గిరిజన సంఘీభావ యాత్ర’ జరిగింది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోని మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో వంద మందికి పైగా ప్రజలు మరణించగా వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇళ్లను ముట్టడించి దగ్ధం చేయడంతో సుమారు 50,000 మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. 300కుపైగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధిత కుటుంబాలు ఉంటున్నాయి. ఈ శిబిరాలపై కూడా దాడులు జరుగుతున్నాయి.
#WATCH | Party workers and locals staged a protest after Congress leader Rahul Gandhi's carcade was stopped by the police in Bishnupur, Manipur. pic.twitter.com/X3UCVDF0Vl
— ANI (@ANI) June 29, 2023