NEET Leaks : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నీట్ వ్యవహరంపై ప్రభుత్వ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. నీట్ రగడపై రాహుల్ గాంధీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నీట్ 2024 ప్రశ్నాపత్రాల లీకేజ్ మన విద్యా వ్యవస్ధలో సమస్యలకు సంబంధించి తీవ్ర సమస్యని రాహుల్ పేర్కొన్నారు. నీట్ ఒక్కటే కాకుండా అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోందని ఆరోపించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని ప్రతి ఒక్కరినీ నిందిస్తున్నారని అన్నారు.
అసలేం జరుగుతుందనేది కూడా మంత్రికి అర్ధం కావడం లేదని తనకు అనిపిస్తున్నదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మన పరీక్షల వ్యవస్ధ లోపభూయిష్టంగా తయారైందనే ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొందని అన్నారు. విద్యా వ్యవస్ధ అంతా మోసపూరితమని లక్షలాది విద్యార్ధులు భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు సంపన్నులైతే డబ్బు చెల్లించి దేశ పరీక్షల వ్యవస్ధను కొనుగోలు చేయవచ్చని విద్యార్ధులు నమ్ముతున్నారని చెప్పారు. విద్యార్ధుల్లో నెలకొన్న భావనే విపక్షం కూడా కలిగిఉందని రాహుల్ వివరించాఇరు. ఈ వ్యవహారంపై ఒక రోజంతా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు.
తన పర్యవేక్షణలో ఎక్కడా ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని చెప్పుకొచ్చారు. గత ఏడేండ్లలో ఎక్కడా పేపర్ లీక్‌లకు సంబంధించి ఆధారాలు లభించలేదని అన్నారు. నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు ముందున్నదని, ఎన్టీఏ అమలు తర్వాత 240కిపైగా విజయవంతంగా నిర్వహించామని తాను పూర్తి విశ్వాసంతో చెప్పగలనని పేర్కొన్నారు. నీట్ వివాదాన్ని చక్కదిద్దేందుకు మీరేం చర్యలు తీసుకున్నారని రాహుల్ ప్రశ్నించగా గట్టిగా అరిచినంత మాత్రాన అసత్యం నిజం కాబోదని అన్నారు. దేశ పరీక్షల వ్యవస్ధ సవ్యంగా లేదని విపక్ష నేత చేపట్టడం ఖండించాల్సిన విషయమని మంత్రి పేర్కొన్నారు.
Read More :
Bhadrachalam | మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి