Bhadrachalam | మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నది ఉగ్రరూపం దాల్చింది. సోమవారం నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదారమ్మ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది. మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 మీటర్లు కాగా, ప్రస్తుతం 15.130 మీటర్లు వుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
భద్రాద్రి జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు వరద నీరు చేరింది. కిన్నెరసానిలో 16 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలిపెట్టారు. 407 అడుగుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 403.30 అడుగులు నీటిమట్టం ఉంది. సాయంత్రానికి ఆరు గేట్లు ఎత్తివేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో మొత్తం 25 గేట్లను ఎత్తి 92,121 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి వరద ప్రభావం వల్ల అక్కడ ఈతవాగు పొంగడంతో గుంపల్లి చర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో సున్నంబట్టి, కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

