న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్లో ముగియనుంది.
ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తయ్యింది. ఇవాళ ఢిల్లీలో యాత్ర ముగించుకుని రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించనున్నారు. ఢిల్లీ నుంచి ఘజియాబాద్‌లోని లోని ఏరియా గుండా రాహుల్ పాదయాత్ర యూపీలోకి చేరనుంది.
ఈ క్రమంలో ఘజియాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాహుల్ రాక కోసం సిద్ధమవుతున్న కార్యకర్తల సందడితో రోడ్లన్నీ నిండిపోయాయి. పట్టణంలో ఎటుచూసినా కాంగ్రెస్ జెండాలే దర్శనమిస్తున్నాయి. కాగా ఇవాళ ఢిల్లీలో యాత్ర పునఃప్రారంభానికి ముందు రాహుల్‌గాంధీ మర్ఘాట్ హనుమాన్ మందిర్‌ను దర్శించుకుని, పూజలు చేశారు.
#WATCH | Congress’ Bharat Jodo Yatra underway in Delhi; visuals from Jafrabad area pic.twitter.com/bitZKR0uN0
— ANI (@ANI) January 3, 2023