Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి అమెరికా పర్యటనకు (US Visit) వెళ్లారు. రాహుల్ దక్షిణ అమెరికా (South America) పర్యటనకు బయల్దేరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్, కొలంబియాతో పాటు మరో రెండు దేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత పర్యటించనున్నారు. అక్కడ రాజకీయ నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు, వ్యాపారవేత్తలతో సంభాషించనున్నారు.
కాగా, గతంలో రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత పర్యటనల్లో రాహుల్.. భారత్‌లో మత స్వేచ్ఛ, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటనలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న చర్చ జరుగుతోంది.
Also Read..
Road Accident | డివైడర్‌ను ఢీ కొట్టిన థార్ కారు.. ఐదుగురు మృతి
R Venkataramani: అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి పునర్ నియామకం