గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 02:05:36

రాఫెల్‌ రాక నేడే

రాఫెల్‌ రాక నేడే

  • ఫెళ.. ఫెళ.. రాఫెల్‌!
  • పాక్‌, చైనా యుద్ధ విమానాలను తలదన్నే విశిష్ఠతలు 
  • లక్ష్యాల పరిధి, ప్రయాణించే దూరం.. 
  • క్లిష్ట సమయాల్లో ఎగిరే ఎత్తు అన్నింటా ఎంతో బెటర్‌ 

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావణకాష్టాన్ని రగిలిస్తున్న పాకిస్థాన్‌కు, ఇటీవలి కాలంలో తరచూ కయ్యానికి దిగుతున్న చైనాకూ.. ఏకకాలంలో బుద్ధిచెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లతో భారత్‌ సంతరించుకోనున్నది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు నేడు (బుధవారం) హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకోనున్నాయి. చైనా స్వయంగా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20, చైనాలో తయారై పాక్‌ వాయుసేనకు చేరిన జేఎఫ్‌-17తో పోలిస్తే రాఫెల్‌ పలు విషయాల్లో మెరుగైనదని సైనిక నిపుణులు చెబుతున్నారు.

నేడే రాక.. అంబాలాలో నిషేధాజ్ఞలు

ఫ్రాన్స్‌నుంచి రాఫెల్‌ విమానాల రాక నేపథ్యంలో అంబాలాలోని వైమానిక స్థావరం పరిసర ప్రాంతాల్లో మంగళవారం నిషేధాజ్ఞలు విధించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫొటోలు, వీడియోలు తీయటాన్ని నిషేధించారు. వైమానిక స్థావరానికి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు డ్రోన్లను అనుమతించబోమని అంబాలా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఎయిర్‌బేస్‌ చుట్టుపక్కల గ్రామాల్లో నలుగురికంటే ఎక్కువమంది గుమికూడకుండా 144వ సెక్షన్‌ విధించినట్టు డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌శర్మ తెలిపారు.logo