Rabri Devi : నిర్మలమ్మ బడ్జెట్‌పై విపక్షాల ముప్పేట దాడి కొనసాగుతున్నది. బిహార్, ఏపీలకు మాత్రమే మెరుగైన కేటాయింపులు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలను గాలికొదిలేశారని మోదీ సర్కార్ వివక్షపై విపక్షం భగ్గుమంటోంది. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు చేపట్టింది. ఇక ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం మినహా మరొకటి కాదని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగేందుకు మాత్రమే ఏపీ, బిహార్‌లకు కొద్దిపాటి నిధులు విదిల్చారని వ్యాఖ్యానించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని నితీష్ కుమార్ కోరుతున్నారని, అసలు ప్యాకేజ్‌లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. బిహార్ ప్రజలకు ఉద్యోగాలు దక్కాలని, ధరల మంట నుంచి ఉపశమనం లభించాలని అన్నారు.
ఫ్లైఓవర్లు నిర్మించారు కానీ, వాటిలో 20 వంతెనలు కుప్పకూలాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో బిహార్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం వంచించిందని దుయ్యబట్టారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్ధితి గురించి ప్రశ్నించగా, ఆయన చికిత్స పొందేందుకు ఆస్పత్రికి వెళ్లారని ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని రబ్రీదేవి పేర్కొన్నారు.
Read More :
Actress Anjali | పుష్పను అంతా ఈజీగా వదిలిపెట్టను: నటి అంజలి