పాకిస్థానీ జర్నలిస్టు అరూసా ఆలంతో మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సంబంధాలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా చెప్పారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న అరూసా ఆలం.. కొన్నేండ్లుగా కెప్టెన్ అమరిందర్ సింగ్ ఫ్రెండ్ అని తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. పంజాబ్ హోంశాఖను కూడా సుఖ్జిందర్ సింగ్ రంధావా చూస్తున్నారు.
కెప్టెన్ అమరిందర్ సింగ్, అరుసా ఆలం కొన్నేండ్లుగా స్నేహితులు. ఆమె ఏండ్ల తరబడి భారత్‌లోనే ఉన్నారు. కేంద్రం టైం టు టైం అరుసా ఆలం వీసాను పొడిగించింది అని రంధావా గుర్తు చేశారు. అంతే కాదు ఇటీవల సీఎంగా అమరిందర్ సింగ్ వైదొలిగిన తర్వాతే ఆలం.. పాకిస్థాన్‌కు వెళ్లిపోయారని చెప్పారు. నాలుగున్నరేండ్లుగా ఆలం వీసాను కేంద్రం ఎందుకు రద్దు చేయలేదని రంధావా ప్రశ్నించారు. కెప్టెన్‌ను యావత్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాక ఆమె భారత్‌ను ఎందుకు వీడారని నిలదీశారు. దీనిపై విచారణ జరిపించాల్సిందేనని, ఈ ప్రశ్నలకు కెప్టెన్ సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.
అయితే దీనిపై కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా రియాక్టయ్యారు. రంధావా ఇప్పుడు తనపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి అన్ని క్లియరెన్స్‌లు లభించాకే అరూసా ఆలం.. భారత్‌కు వచ్చారని చెప్పారు. నా క్యాబినెట్ మంత్రిగా ఏనాడూ అరూసా ఆలం గురించి ఫిర్యాదు చేసినట్లు వినలేదన్నారు కెప్టెన్. రాష్ట్రంలో శాంతిభద్రతలను పట్టించుకోకుండా డిప్యూటీ సీఎంగా రంధావా.. నిరాధారమైన ఆరోపణలపై దర్యాప్తునకు డీజీపీని ఆదేశిస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hyderabad | ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అగ్రస్థానం
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళపై కన్నేసి ఆపై లైంగిక దాడి!
నంబర్ 16 నుంచి ‘ఇండియాజాయ్’.. తెలంగాణ ప్రభుత్వం మద్దతు