Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
బుల్లెట్ బండి డాక్టర్ | నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్తపా డుగు డుగు డుగు డుగని.. అంటూ ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు
నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్తపా డుగు డుగు డుగు డుగని.. అంటూ ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అనే పాట కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయింది. బుల్లెట్ బండికి ప్రస్తుతం చాలా క్రేజ్ ఉంది. అందుకే.. ఆ బండి మీద పాటలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు ఆ బుల్లెట్ బండి డాక్టర్ గురించి అంతా చర్చిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్ సుధాకర్‌ను అందరూ బుల్లెట్ డాక్టర్ అని పిలుస్తారు. దానికి కారణం ఏంటో తెలుసా? గత 50 ఏళ్ల నుంచి బుల్లెట్ బండిని రిపేర్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు సుధాకర్.
సుధాకర్.. బుల్లెట్ బండి రిపేరింగ్ నేర్చుకున్న సమయంలో హైదరాబాద్‌లో చాలా తక్కువ బుల్లెట్ బైక్స్ ఉండేవట. ఇప్పుడు మాత్రం సిటీలో రోడ్ల మీద ఎక్కడ చూసినా బుల్లెట్ బండ్లు మాత్రమే కనిపిస్తున్నాయని చెబుతున్నాడు. వందల బైకులు ఉన్నా కూడా బుల్లెట్ బండిని ఈజీగా గుర్తుపట్టేస్తారు. బుల్లెట్ బండి సౌండ్, దాని డిజైన్.. ఎంతైనా బుల్లెట్ బండి.. బుల్లెట్ బండియే అంటూ సుధాకర్… బుల్లెట్ బండి గురించి చెప్పుకొచ్చాడు. ఆయన్ను సుధాకర్ అన్న లేదా బుల్లెట్ డాక్టర్ అని మాత్రమే పిలుస్తారు.

5 దశాబ్దాల కింద 69 ఏళ్ల సుధాకర్ బైక్ మెకానిక్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ముందు అన్ని రకాల బైక్‌ల రిపేర్ చేసే సుధాకర్.. తర్వాత బుల్లెట్ బండి రిపేర్ చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత 1950 నుంచి 2000 వరకు బుల్లెట్ బండ్లనే రిపేర్ చేశాడు. మధ్యలో కొన్ని రోజులు బోయిగూడలో తన సొంత షాపు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు కొన్ని వేల బుల్లెట్ బైక్స్‌ను సుధాకర్ రిపేర్ చేశాడు. ఇంగ్లండ్ మ్యూజియం నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన బుల్లెట్ 750సీసీ బైక్‌ను కూడా సుధాకరే రిపేర్ చేశాడు.
బుల్లెట్ బండిని రిపేర్ చేయడంతో పాటు.. దాన్ని రీఅరేంజ్ చేయడం లాంటి అన్ని రకాల పనులను చేయడం వల్ల.. హైదరాబాద్‌లో బుల్లెట్ డాక్టర్‌గా సుధాకర్ ప్రసిద్ధిగాంచాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
‘అందరి పిల్లలు తాగుతారు’.. వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో..!
Viral video: ఉప్పొంగి ప్రవహిస్తున్న గౌలా నది.. నీటి నడుమ చిక్కుకున్న ఏనుగు..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

