Viral Video : పెండ్లి వేడుకల్లో అప్పుడప్పుడూ వధూవరులపై కరెన్సీ నోట్లు చల్లడం చూస్తూనే ఉంటాం. ఆ కరెన్సీ నోట్ల విలువ సాధారణంగా వేలల్లోనే ఉంటుంది. కానీ, ఒక వేడుకలో రూ.8.5 కోట్ల రూపాయలు చల్లారంటూ ప్రచారం మొదలైంది. అయితే, అందులో నిజం లేదని వధూవరుల తరఫు కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్లోని తార్న్ తారన్లో ఇటీవల ఒక ఖరీదైన పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి అనంతరం సిక్కు జంట సహా బంధువులు నోట్ల వర్షం కురిపించారు. బంధువుల్లో పలువురు ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వారు కూడా డాలర్లు గాలిలోకి ఎగరేశారు. వధువు, వరుడు, వారి తరఫు బంధువులు అంతా కలిసి సంచుల్లో తెచ్చుకున్న కరెన్సీ నోట్లను గాల్లోకి ఎగరేశారు. వధూవరులపై చల్లారు. సంచుల్లోంచి డబ్బులు తీస్తూ చల్లుతూనే ఉన్నారు. దీంతో ఆ వేదికవద్ద నేలపై, స్టేజీపై మొత్తం కరెన్సీ నోట్లే పడి ఉన్నాయి. ఎటు చూసినా నోట్లే. అడుగు వేయడానికి కూడా సందులేనంతగా నోట్లు పడి ఉన్నాయి. వాటి విలువ మొత్తం రూ.8.5 కోట్లు ఉంటుందని, ఇది గ్రాండ్ క్యాష్ పార్టీ అని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ అంశం బాగా హైలైట్ అయ్యింది. దీంతో వధూవరుల కుటుంబ సభ్యులు, అక్కడి వేడుక నిర్వాహకులు స్పందించారు.
पंजाब के तरन तारन में एक शादी में दुल्हन पर लोग आ आ कर पैसे उड़ा रहे है..
खुद दुल्हा बड़ी खुशी से अपनी दुल्हन पर नोटो की गड्डियां खोल खोल के नोट उड़ा रहा था
पहले अफवाह उड़ी कि 8 करोड़ रुपए थे बाद में DJ वाले ने बताया 4 से 5 लाख रुपए थे
मुंबई में जब बार चलते थे तो वहां भी ऐसे… pic.twitter.com/X2Uo8TKVtB
— बघीरा 😺 (@LegalAdvisour) February 18, 2026
ఆ నోట్ల విలువ రూ.8.5 కోట్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇదంతా లక్షల్లోనే ఉండొచ్చన్నారు. ఇంకొందరు మాత్రం ఆ నోట్ల విలువ దాదాపు రూ.4.5 లక్షలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. వరుడి సోదరుడు మాట్లాడుతూ తమ కుటుంబం అమెరికాలో ట్రక్కుల వ్యాపారం చేస్తుంటుందని, ఈ పెళ్లి ఫిబ్రవరి 14న జరిగిందన్నాడు. రూ.4.5 లక్షలు మాత్రమే చల్లామని చెప్పాడు. మరోవైపు అక్కడ డీజే ఏర్పాటు చేసిన వారు కూడా ఇదే చెబుతున్నారు. నిజంగా రూ.8.5 కోట్లు అంటూ జరుగుతున్న ప్రచారంపై తమకు అవగాహన లేదన్నారు.