farmers protest | నాల్గవ రోజుకు చేరిన పంజాబ్ రైతుల నిరసన.. 54 రైళ్లు రద్దు
farmers protest | పంజాబ్‌లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
చండీగఢ్: పంజాబ్‌లో రైతుల నిరసన (farmers protest) నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైతుల ఆందోళన సందర్భంగా హర్యానా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరసన చేపట్టారు. పంజాబ్, హర్యానా సరిహద్దు సమీపంలోని శంభులో అంబాలా-లూథియానా-అమృత్సర్ మార్గంలో రైలు పట్టాలపై బైఠాయించారు. అరెస్ట్ చేసిన ముగ్గురు రైతులను విడుదల చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
కాగా, రైతుల నిరసనల వల్ల మూడు రోజుల్లో 380 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిందని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

