పుణె: బీహార్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పుణె న్యాయవాది సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ వివాదంగా మారింది. ఓటు చోరీ ఆరోపణలకు ఆజ్యం పోసింది. న్యాయవాది తన చేతి వేలుకున్న సిరాను చూపుతూ మోదీ కోసం ఓటు వేశానని, బీహార్ ప్రజలు కూడా ఓటు వేయాలంటూ ఓ సెల్ఫీని ఎక్స్‌లో పోస్టు చేశారు.
వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె పుణెలో గతంలో ఓటు వేసినప్పటి ఫొటోలను తవ్వి తీసి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి ఓటర్లను బీజేపీ తరలిస్తోందనడానికి ఇదే ఉదాహరణ అంటూ మండిపడ్డారు. తన సెల్ఫీ వివాదంపై ఆ మహిళ స్పందిస్తూ బీహార్ ఓటర్ల ప్రేరణ కోసం మాత్రమే తాను ఎక్స్‌లో పోస్టు చేశానని, తాను బీహార్‌లో ఓటేయలేదన్నారు.