PSLV-C59 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. గతంలో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్ ప్రయోగించింది. ఇవాళ సాయంత్రం చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 (PSLV – C59) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
👏 Celebrating Success!
The PSLV-C59/PROBA-3 Mission reflects the dedication of NSIL, ISRO and ESA teams. This achievement highlights India’s critical role in enabling global space innovation.
🌍 Together, we continue building bridges in international space collaboration! 🚀✨…
— ISRO (@isro) December 5, 2024
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) సహకారంతో ప్రోబా-3ని ప్రయోగించింది. ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్) ఉన్నాయి. మొత్తం దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా-3 లక్ష్యం. ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరించనున్నాయి.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C59/PROBA-3 mission from Sriharikota, Andhra Pradesh
PSLV-C59 vehicle is carrying the Proba-3 spacecraft into a highly elliptical orbit as a Dedicated commercial mission of NewSpace India Limited (NSIL)
(Visuals:… pic.twitter.com/WU4u8caPZO
— ANI (@ANI) December 5, 2024
Also Read..
PSLV-C59 | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్
Stock Market | వరుస లాభాల్లో మార్కెట్లు.. 800 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్