Nitin Gadkari | రోడ్డు ప్రమాదాల్లో ఏడాదిలో 1.68లక్షల మంది దుర్మరణం.. ఆందోళన వ్యక్తం చేసిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari | దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో 60శాతం మంది యువకులేనన్నారు. కేంద్రమంత్రి లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Nitin Gadkari | దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో 60శాతం మంది యువకులేనన్నారు. కేంద్రమంత్రి లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం, టోల్ సెంటర్ల సంఖ్య వరకు పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (RLP) ఎంపీ హనుమాన్ బెనివాల్ లోక్‌సభలో ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే లోపాలను ఎత్తి చెప్పారు. ఇప్పటి వరకు 150 మంది మృతి చెందారని.. దౌసాలోనే 50 మందిపైగా మరణించారని నాగౌర్ ఎంపీ తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేపై నియమించిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు, విచారణ నివేదికకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన బదులిచ్చారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అని, ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో నిర్మించినట్లు తెలిపారు.
రూ.లక్ష కోట్ల ఖరీదుతో వేశామన్నారు. పలుచోట్ల రోడ్డు దెబ్బతిందని.. మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో నలుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులపై చర్యలు తప్పవన్నారు. నిర్ణీత సమయంలో పనులు చేయాలని కోరుకుంటున్నామని.. కాంట్రార్ట్లు గడువులోగా పనులు చేయాల్సిందేనన్నారు. ఎవరితో ఏ విషయంలోనూ రాజీపడబోమన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దేశంలో ఏడాది కాలంలోనే 1.68లక్షల మంది మరణించారన్నారు. ఇందులో 60శాతం యువకులే ఉన్నారని.. ఇది విచారకరమన్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు సమాజం సహకరించాలన్నారు. ఏ అల్లర్లలోనూ ఇంత మంది చనిపోలేదని.. రోడ్డు ప్రమాదాల్లోనేనన్నారు. చనిపోయిన వారిలో 60శాతం మంది బాలబాలికలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర శాసన మండలిలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గాయపడితే నాలుగుచోట్ల ఎముకలు విరిగాయని.. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నానన్నారు. రోడ్డు భద్రత విషయంలో ఎంపీలు సైతం సహకరించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

