Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఉపాధి కల్పన ఊసే లేదని కాగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రియాంక హిమాచల్ ప్రదేశ్లోని కులులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చిన్న మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు సమకూరుతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఉపాధి కల్పనను పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు.
ఈ పరిస్ధితిని నివారించేందుకు బీజేపీ విధానాలను మనం మార్చాల్సి ఉందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బీజేపీ విధానాలు చిన్న పరిశ్రమలు చితికిపోయేలా ఉన్నాయని అన్నారు. కాషాయ పాలకుల విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అవుతుంటే బిలియనీర్లు మరింత సంపద పోగేసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు.
Read More :