షిమ్లా: కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఫలితాలు వెలుబడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా(Priyanka Gandhi) ఇవాళ షిమ్లాలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటకలో కౌంటింగ్ సందర్భంగా ఆమె హనుమాన్ గుడిలో ప్రార్థనలు చేశారు. దేశం, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రియాంకా గాంధీ ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆమె పూజలు చేశారు.
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
224 స్థానాలు ఉన్న కర్ణాటకలో.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 113 సీట్లు వచ్చిన పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 75, జేడీఎస్ 26 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.