లక్నో, ఆగస్టు 27: ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆసక్తి కనబరుస్తున్నది. ఈ మేరకు త్వరలో పార్టీ హైకమాండ్‌కు ప్రతిపాదనలు పంపుతామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ వారణాసి నుంచి బరిలో నిలవాలని తాము కోరుకొంటున్నట్టు చెప్పారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్‌రాయ్ పోటీచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ వారణాసి నుంచే పోటీచేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.