న్యూఢిల్లీ: కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. (Kerala MPs Protest) కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్‌కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు. ‘జస్టిస్ ఫర్ వాయనాడ్. వాయనాడ్‌కు రిలీఫ్ ప్యాకేజీ అందించండి’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘వాయనాడ్‌కు న్యాయం చేయండి. వివక్ష చూపవద్దు’ అని నినాదాలు చేశారు.
కాగా, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వాయనాడ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నదని ఆరోపించారు. వాయనాడ్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్‌లోని బాధితులను రాజకీయాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వివక్ష చూపకూడదని ఆమె అన్నారు.
మరోవైపు వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, డిసెంబర్ 3న కేరళ ప్రతిపక్ష ఎంపీలతో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తక్షణ సహాయం అందించాలని కోరారు. జూలై 30న భారీ వర్షాలకు వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 300 మందికిపైగా మరణించగా అనేక ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. ముండక్కై, చూరల్మల ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు.
#WATCH | Delhi: Opposition MPs from Kerala including Wayanad MP Priyanka Gandhi Vadra stage protest at Makar Dwar of Parliament demanding financial aid for landslide-affected people in Wayanad pic.twitter.com/aISeKa1jQR
— ANI (@ANI) December 14, 2024
#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, “The government is refusing to give a special package to Wayanad. We have requested the Home Minister, we have written to the Prime Minister…Himachal Pradesh has also seen similar large-scale devastation and there is a… https://t.co/mIyBAQipwu pic.twitter.com/7xdie56kHH
— ANI (@ANI) December 14, 2024