Priyank Kharge : కర్నాటకలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని రాష్ట్ర గవర్నర్ పేర్కొనడం తనకు విస్మయం కలిగించిందని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరసనలు జరగడం లేదని, కేవలం బీజేపీ శ్రేణులే నిరసనలు చేపడుతున్నారని అన్నారు. ప్రియాంక్ ఖర్గే గురువారం బెంగళూర్లో విలేకరులతో మాట్లాడారు.
బీఎస్ యడియూరప్ప ప్రాసిక్యూషన్కు అనుమతించినప్పుడు బీజేపీ గవర్నర్ తీరును తప్పుపడుతూ నిరసన తెలిపిందని, కర్నాటక బంద్కు పిలుపు ఇచ్చిందని గుర్తుచేశారు. తాము ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా అని ప్రశ్నించారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ శాంతియుత పద్ధతుల్లో పోరాడుతున్నదని చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పేలా వ్యవహరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఖర్గే ఆరోపించారు. కర్నాటకలో రాజ్యాంగ సంక్షోభానికి గవర్నర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి పూర్తిగా అదుపులో ఉందని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.శాంతిభద్రతలు గాడితప్పాయని స్వయంగా రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.
Read More :
PM Modi: భారత విదేశీ విధానం మారింది.. పోలాండ్లో ప్రధాని మోదీ