PM Modi: భారత విదేశీ విధానం మారింది.. పోలాండ్‌లో ప్రధాని మోదీ
PM Modi : భారతీయ విదేశీ విధానంలో మార్పు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దశాబ్ధాలుగా ఉన్న విదేశీ విధానం ఇప్పుడు మారిందన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) పోలాండ్ పర్యటనలో ఉన్నారు. నాలుగు దశాబ్ధాల తర్వాత భారతీయ ప్రధాని ఆ దేశానికి వెళ్లారు. 1979లో చివరిసారి ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొన్ని దశాబ్ధాలుగా .. అన్ని దేశాలకు దూరంగా ఉండాలన్న రీతిలో భారత విదేశాంగ విధానం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు విదేశీ విధానంలో 180 డిగ్రీల మార్పు వచ్చిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారిందని, అన్ని దేశాలతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండడమే భారతీయ విధానమని ప్రధాని మోదీ వెల్లడించారు. నేటి భారత్ ప్రతి ఒక్కరితోనూ కనెక్ట్ కావాలని చూస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ లాభం చేకూరాలని భారత్ ఆలోచిస్తోందన్నారు. భారత్‌ను విశ్వబంధుగా ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వార్సాలో ఉన్న ఆయన.. రైలు మార్గం ద్వారా ఉక్రెయిన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఆయన జెలెన్స్కీని కలుసుకుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- foreign policy
- India
- Pm Modi
- Poland
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

