న్యూఢిల్లీ: లోక్సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు.
పార్లమెంట్ సాక్షిగా బిధూరి తనపై చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతంగా తనపై జరిగిన దాడి మాత్రమే కాదని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. సభలో ఇటీవల జరిగిన పరిణామాలు పార్లమెంట్ సభ్యుడిగా తనకు దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు.