లోక్‌సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలోనే మతపరమైన దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బిధూరిని నియమించింది.
కొత్త పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ కున్వర్ డానిష్ అలీనికి ఉద్దేశించి ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశ�