న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలోనే మతపరమైన దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బిధూరిని నియమించింది. టోంక్ నుంచి కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ బరిలోకి దిగనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
టోంక్‌లో పైలట్‌కు మంచి పట్టుంది. రాజస్థాన్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభలో చంద్రయాన్-3పై చర్చ సందర్భంగా డానిష్ అలీపై బిధూరీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ముస్లిం ఉగ్రవాది అంటూ బిధూరీ దూషించారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.