శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 16, 2021 , 10:51:41

క‌రోనా ఖ‌తం.. దేశ‌వ్యాప్త వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన మోదీ

క‌రోనా ఖ‌తం.. దేశ‌వ్యాప్త వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ :  క‌రోనా ఖ‌తం చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది.  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ వ‌ర్చువ‌ల్ విధానంలో వ్యాక్సినేష‌న్‌‌ను ప్రారంభించారు. ఇది దేశ చ‌రిత్ర‌లో మ‌రుపురాని రోజు. ప్రపంచ‌వ్యాప్తంగా ప్రాణాంత‌కంగా మారిన క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్‌ను మొద‌లుపెట్టింది.  క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంద‌న్న టెన్ష‌న్ ఉండేదని, క‌రోనా టీకా వ‌చ్చేసింద‌ని మోదీ అన్నారు.  ప్ర‌పంచం అంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసింద‌న్నారు.  వ‌ర్చువ‌ల్ రీతిలో టీకా పంపిణీ ప్రారంభించిన త‌ర్వాత మోదీ మాట్లాడుతూ.. రాత్రి, ప‌గ‌లు లేకుండా శాస్త్ర‌వేత్త‌లు టీకా కోసం శ్ర‌మించార‌న్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో టీకా వ‌చ్చేసింద‌న్నారు.  మేడి ఇన్ ఇండియా టీకాలు రెండు వ‌చ్చాయ‌న్నారు.  ఇది భార‌త సామ‌ర్థ్యం అన్నారు. వైజ్ఞానికి స‌త్తా అన్నారు. భార‌తీయ ట్యాలెంట్ అన్నారు.  ఎవ‌రికైతే అత్య‌వ‌స‌ర‌మో.. వారికి ముందుగా టీకా ఇస్తున్నాం అన్నారు.

మేడ్ ఇన్ ఇండియా టీకాలు..

డాక్ట‌ర్లు, న‌ర్సులు, హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందుతున్నారు. మెడిక‌ల్ టీమ్ కూడా క‌రోనా టీకా తీసుకునేవారిలో ముందున్నార‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రెండు డోసులు వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి అన్నారు.  అన్ని రాష్ట్రాలు కూడా టీకా పంపిణీకి సన్న‌ద్దం అయి ఉన్నాయ‌న్నారు.  గ‌తంలో ఎన్న‌డూ ఇంత పెద్ద రీతిలో వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌లేద‌న్నారు. తొలి ద‌ఫాలో మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకా ఇస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. సాధార‌ణంగా వ్యాక్సిన్ త‌యారీకి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని, కానీ శ‌ర‌వేగంగా మ‌న సైంటిస్టులు టీకాను రూపొందించిన‌ట్లు చెప్పారు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌తో పాటు మ‌రికొన్ని టీకాల అభివృద్ధి జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

రెండు డోసులు త‌ప్ప‌నిస‌రి..

కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత ముందు జాగ్ర‌త్త‌ల‌ను అస‌లు మ‌ర‌వ‌కూడ‌ద‌ని మోదీ అన్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్ప‌కుండా తీసుకోవాల‌ని ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు.  రెండు డోసుల మ‌ధ్య నెల రోజుల తేడా ఉండాల‌ని నిపుణులు చెబుతున్న‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. తొలి డోసు తీసుకున్న త‌ర్వాత ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ‌రాద‌న్నారు. ఎందుకంటే రెండ‌వ డోసు తీసుకున్న త‌ర్వాతే ఇమ్యూనిటీ పెరుగుతుంద‌న్నారు. సుర‌క్షితంగా తేలిన త‌ర్వాతే వ్యాక్సిన్ల‌కు పచ్చ‌జెండా ఊపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

దేశం అంటే మ‌ట్టి కాదు..

దేశం అంటే మ‌ట్టి కాదు.. దేశం అంటే మ‌నుషులోయ్ అన్న గురుజాడ వ్యాఖ్య‌ల‌ను మోదీ త‌న ప్ర‌సంగంలో వినిపంచారు.  ప్ర‌జ‌లు ఒక‌రికి ఒక‌రు ఉప‌యోగ‌ప‌డాల‌న్న ఉద్దేశాన్ని ఆయ‌న వినిపించారు. కోవిడ్ అంతానికి ఇది ప్రారంభం అని మోదీ అన్నారు. టీకాల‌ను అతి చౌక‌గా అందిస్తున్నామ‌న్నారు.  ఇత‌ర దేశాల‌తో పోలిస్తే త‌క్కువ ధ‌ర‌కే టీకాలు అందుబాటులో ఉన్న‌ట్లు మోదీ తెలిపారు. మ‌న టీకాల‌ను అతిశీత‌ల వాతావ‌ర‌ణంలో స్టోర్ చేయాల్సి అవ‌స‌రం లేద‌ని అన్నారు. గ‌తంలో ఎన్న‌డూ ఈ స్థాయిలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌న్నారు.  సుమారు వంద దేశాలు .. మూడు కోట్ల జ‌నాభా క‌న్నా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, కానీ మ‌నం తొలి ద‌శ‌లోనే మూడు కోట్ల మందికి టీకా ఇస్తున్నామ‌న్నారు.  రెండ‌వ ద‌శ‌లో ఆ సంఖ్య 30 కోట్లు ఉండాల‌న్నారు. 

VIDEOS

logo