Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది స్పష్టమైందని, దీనికి ఓపీనియన్ పోల్స్ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తారనే ప్రకటన వెలువడిన అనంతరం మోదీ స్పందించారు.
రాహుల్ వయనాడ్‌తో పాటు మరో స్ధానం నుంచి పోటీ చేస్తారని తాను గతంలో చెప్పానని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్-దుర్గాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రాహుల్ వయనాడ్‌లో ఓటమి పాలవుతారని తాను చెప్పానని, అందుకే రెండో స్ధానం కోసం వెతుకులాట చేపట్టి రాయ్‌బరేలి నుంచి బరిలో నిలిచారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాలని కోరుకుంటోందని, దళితులు, ఓబీసీ కోటాలను కత్తిరించి వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాలని కుయుక్తులు పన్నుతోందని మోదీ దుయ్యబట్టారు. విపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకోవని, ఓట్ల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే వాటికి తెలిసిన మార్గమని ఆరోపించారు.
Read More :