శనివారం 15 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 10:47:03

రాష్ట్రపతి, ప్ర‌ధాని బ‌క్రీద్ శుభాకాంక్ష‌లు

రాష్ట్రపతి, ప్ర‌ధాని బ‌క్రీద్ శుభాకాంక్ష‌లు

న్యూఢిల్లీ : దేశంలోని ముస్లిం సోద‌రుల‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌క్రీద్ శుభాకాంక్ష‌లు తెలిపారు. బక్రీద్  సేవ, మానవత్వం,  సోదరభావం,  త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు  రాష్ట్రపతి.  కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక దూరం పాటించి ప్రార్థ‌న‌ల్లో పాల్గొనాల‌ని రాష్ర్ట‌ప‌తి కోరారు. 

సామ‌ర‌స్య‌పూర్వ‌క‌, స‌మ‌గ్ర‌మైన స‌మాజాన్ని నిర్మించేందుకు ప్రేర‌ణ క‌లిగిస్తుంద‌ని భావిస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. సోద‌ర‌భావ స్ఫూర్తి ఇలాగే కొన‌సాగాల‌ని ఆశిస్తున్న‌ట్లు మోదీ చెప్పారు. 


logo