Droupadi Murmu | ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జార్ఖండ్ మాజీ సీఎం (former Jharkhand CM) శిబు సోరెన్ (Shibu Soren)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పరామర్శించారు. ఇవాళ ఆసుపత్రికి వెళ్లిన రాష్ట్రపతి.. అక్కడ శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ ఆరోగ్య పరిస్థితి గురించి హేమంత్ సోరెన్‌ను అడిగి తెలుసుకున్నారు.
81 ఏళ్ల శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో శిబు సోరెన్‌కు చికిత్స కొనసాగుతోంది. అయితే, రాష్ట్రపతి ముర్ము 2015 మే నుంచి 2021 జులై వరకూ జార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శిబు సోరెన్‌తో ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే మాజీ సీఎంను రాష్ట్రపతి పరామర్శించారు.
President Droupadi Murmu visited the ailing former Chief Minister of Jharkhand, Shri Shibu Soren, at Sir Ganga Ram Hospital. She met Shri Soren’s son and Chief Minister of Jharkhand Shri Hemant Soren, and enquired about Shri Shibu Soren’s health. pic.twitter.com/0fEsX8OyrK
— President of India (@rashtrapatibhvn) June 26, 2025
Also Read..
Shubhanshu Shukla | మరికాసేపట్లో ఐఎస్ఎస్కు చేరుకోనున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
NHAI | టూ వీలర్లపై టోల్ ఛార్జీలు.. ఫేక్‌న్యూస్ అని స్పష్టం చేసిన కేంద్రం
Air India | ఎయిర్ ఇండియా విమానం రెక్కలో పక్షిగూడు.. VIDEOS