Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయోగించిన స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక ఐఎస్ఎస్కు చేరువైంది. మరికాసేపట్లో అంతరిక్ష కేంద్రానికి చేరుకోనుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం..) వ్యోమనౌక డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ (Dragon spacecraft) ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
41 ఏండ్ల తర్వాత..
1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే.
శుభాన్షు రోదసి యాత్ర విశేషాలు
Also Read..
“Shubhanshu Shukla | జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నా.. అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా సందేశం”
“అద్వితీయ ‘శుభా’రంభం.. అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాన్షు”
“400 కిలోమీటర్లకు.. 28 గంటలా?”