President Murmu : దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలను పలు ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులతోపాటు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఢిల్లీ (Delhi) లో శ్రీధార్మిక్ లీల కమిటీ ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముర్ము రామబాణం ఎక్కుపెట్టగా.. రావణ దహనం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదం అనే రావణుడిపై మానవత్వం సాధించిన విజయానికి ప్రతీక అన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న భారత సైనికులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నారు.