Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని జగన్నాథ్ మందిర్ (Jagannath Mandir)కు రాష్ట్రపతి వెళ్లారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్నాథుడిని దర్శించుకున్న ముర్ము.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు రాష్ట్రపతికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు రాష్ట్రపతికి బర్త్డే విషెష్ తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ముర్ము ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడి ప్రార్థించారు.
President Droupadi Murmu visited the Jagannath Mandir in Delhi and offered prayers today.
(Pics: Rashtrapati Bhavan) pic.twitter.com/uc8TKLJC7c
— ANI (@ANI) June 20, 2024
Also Read..
Delhi Heatwave | అగ్నిగుండంలా ఢిల్లీ.. వడగాడ్పులకు తొమ్మిది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృత్యువాత
Hajj pilgrims | మక్కాలో తీవ్రమైన వేడి.. మృతిచెందిన హజ్ యాత్రికుల్లో 90 మంది భారతీయులే..?
Klin Kaara | క్లింకార ఫస్ట్ బర్త్డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన